Sri Tallapaka Annamacharya was a saint composer in the
fifteenth century, who hailed from the Tallapaka village, in the Rajampet mandal
of Cuddapah district, Andhra Pradesh, India. Annamacharya was the very first
vaggeyakara (composer) in Telugu and established a tradition which was later
followed by a number of saint composers like Tyagaiah and Kshetraiah. Annamacharya
composed 32,000 keertanas (devotional songs) in praise of Lord Venkateswara.The
Annamacharya Project was established in 1978 with a view to propagate the tatwa
andmahatwa of Lord Sri Venkateswara.Using the vast creative literature of the
Tallapaka poet, the Annamacharya project seeks to inculcate Madhura Bhakti and
Saranagati to Lord Venkateswara, amongst the public.Annamacharya was born on
Vaisakha Suddha Pournami in the year Sarwadhari (May 9, 1408) in Tallapaka, a
village in current day Kadapa district of Andhra Pradesh, India. His wife,
Thimmakka,had written Subhadra Kalyanam, and is considered the first female
poet in . He was born into a Telugu nandavareeka niyogi Brahmin family. Their
son, Pedda Tirumalacharya, and grandson , Tallapaka Chinnayya, were also
composers and poets. The Tallapaka compositions are considered to have dominated and influenced the structure of Carnatic music compositions. Annamacharya
lived for 94 years until Phalguna Bahula Dwadasi in the year Dhundhubhi.Young
and talented artistes, in both vocal and instrumental music, form music troupes
which perform across India - in temples, music sabhas (concerts), important
pilgrim centres, educational institutions, villages and other cultural
organisations.Every year Annamacharya Vardhanti festivals are conducted in
Tirumala, Tirupati and Tallapaka, the birth place of Annamacharya. Annamacharya
Jayanti festivals are also conducted at the national level.Annamacharya
keertanas are rendered daily during the Unjal Seva of Srivaru in the Tirumala
temple, and in other local TTD-managed temples. Annamacharya has composed a
number of folk versions of his keertanas like, Jajaras, Dampulla songs, Suvvi songs,
Elapadas and duets. Music concerts, Harikathas and folk programs are conducted
regularly.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో "నందవరం" గ్రామంలో స్థిరపడినవారు నందవరీకులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) వైఎస్ఆర్ జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.
ఒకనాడు(8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.
తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.
రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.
ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.
ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.
Lyrics in Telugu:
ముద్దులు మోమున ముంచగను | నిద్దపు కూరిమి నించీని
మొలచిరుగంటలు మువ్వలు గజ్జెలు | గలగలమనగా కదలగను
ఎలనవ్వులతో ఈతడు వచ్చి | జలజపు చేతులు చాచీనీ ||
అచ్చపు గుచ్చు ముత్యాల హారములు | పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని | అచ్చట నిచ్చట ఆడీని ||
బాలుడు కృష్ణుడు పరమపురుషుడు | నేలకు నింగికి నెరి పొడవై
చాల వేంకటాచలపతి తానై | మేలిమి చేతల మించీని ||
Lyrics In English:
muddulu mOmuna muMchaganu | niddapu kUrimi niMchIni
molachirugaMTalu muvvalu gajjelu | galagalamanagA kadalaganu
elanavvulatO ItaDu vachchi | jalajapu chEtulu chAchInI ||
achchapu guchchu mutyAla hAramulu | pachchala chaMdrAbharaNamulu
tachchina chEtula tAne daivamani | achchaTa nichchaTa ADIni ||
bAluDu kRshNuDu paramapurushuDu | nElaku niMgiki neri poDavai
chAla vEMkaTAchalapati tAnai | mElimi chEtala miMchIni
Lyrics In Telugu:
పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ- పాలిటిదైవమని బ్రహ్మాదులు
రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు | బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని అంబరభాగమునందు | నాలుగుదిక్కులనుండి నారదాదులు
నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో | పారేటిబిడ్డనివద్ద బాడేరు |
వేరులేనివేదములు వెంటవెంట చదువుచు | చేరిచేరి అంతనంత శేషాదులు
ముద్దులు మోమునగార మూలలమూలలదాగె | బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని | చద్దికి వేడికి వచ్చి సనకాదులు
Lyrics In English:
pAladoMga vadda vacci pADEru tama- pAliTidaivamani brahmAdulu
rOla gaTTiMcuka peddarOlalugA | vApOvu bAlunimuMdara vacci pADEru
AlakiMci vinumani yaMbaraBAgamunaMdu | nAlugudikkulanuMDi nAradAdulu
nOruniMDA jollugAra nUgi dhULimEnitO | pArETibiDDanivadda bADEru
vErulEnivEdamulu veMTaveMTa jaduvucu | jEricEri yiMtanaMta SEShAdulu
muddulu mOmunagAra mUlalamUlaladAge- | baddulabAlunuvadda bADEru addivO
SrItiruvEMkaTAdrISu DitaDani | caddiki vEDiki vacci sanakAdulu

Lyrics In telugu:
తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి |
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
Lyrics In English:
tAne tAnE yiMdari guruDu | sAnabaTTina BOgi j~jAna yOgi ||
aparimitamulaina yaj~jAla vaDijEya | brapannulaku buddhi vacariMci|
tapamugA PalatyAgamu sEyiMcu | kapurula garimala karmayOgi ||
annicEtalanu brahmArpaNavidhi jEya | manniMcu buddhulanu marugajeppi ||
unnatapadamuna konaraga garuNiMcu | pannagaSayanuDE brahmayOgi ||
tanaraga gapiluDai dattAtrEyuDai | Ganamaina mahima SrI vEMkaTarAyaDai |
vinaraga saMsAra yOgamu gRupasEyu | animiShagatula naByAsayOgi ||

ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||
మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు
తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||
పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
Lyrics in English:
itanikaMTE maridaivamu kAnamu yekkaDA vedakina nitaDE
atiSayamagu mahimalatO velasenu anniTikAdhAramutAne ||
madijaladhulanokadaivamu vedakina matsyAvatAraMbitaDu
adivO pAtALAmamdu vedakitE AdikUrmamI viShNuDu
podigoni yaDavula vedaki chUchitE bhUvarAhamanikaMTimi
chedaraka koMDala guhala vedakitE SrInarasiMhaMbunnADu

telisi bhUnabhOMtaramuna vedakina trivikramAkRti nilichinadi
paluvIrulalO vedakichUchitE paraSurAmuDokaDainADU
talapuna SivuDunupArwati vedakina tArakabrahmamurAghavuDu
kelakula nAvulamaMdala vedakina kRShNuDu rAmuDunainAru ||
poMchi asurakAMtalalO vedakina budhdhAvatAraMbainADu
miMchina kAlamu kaDapaTa vedakina mIdaTikalkyAvatAramu
aMchela jIvulalOpala vedakina aMtaryAmai merasenu
yeMchuka ihamuna paramuna vedakina yItaDE SrIvEMkaTavibhuDu ||

Lyrics:
ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా
కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట
మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట --
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట --
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా
కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట --
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట -
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని...
lyrics in English :
AtaDevvADu chUparE ammalAla
Etula nADETikriShNuDItaDE kADugadA
kaMduva dEvaki biDDaganenaTa naDurEyi
aMdi yaSOdaku koDukainADaTa
saMdaDiMchi pUtakichaMTipAlu tAgenaTa
maMdala Avula gAchi malasenaTa
maMchibaMDi dannenaTa maddulu virichenaTa
iMchukaMtavEla koMDayettinADaTa
maMchAlapai golletalamAnAlu chEkonenaTa
miMchula pillagOvivaTTi merasenaTa
kALiMguni meTTenaTa kaMsu( borigonenaTa
pAliMchi surala chEpaTTenaTa
yIlIla SrIvEMkaTAdri niravainadEvuDaTa
yElenaTa padAruvEla iMtula niMdarini

Lyricks:
ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది
యెన్నుకొని వేడుకతో నేలుదువుగాని ||
చేరి నీవు పెంచిన చిలుక కాదు సుమీ
పేరుకొని నీ దేవులు పిలిచీఁగానీ |
కూరిమి నీ వనములలో కోవిల కాదు సుమీ
సారెకు నాకె నిన్నుఁగొసరి పాడీనీ ||
తొలుత నీ కొలఁకుల తొమ్మిదలు గావు సుమీ
సొలసి చూచిన యాపె చూపులు గాని |
చలాన నీపై వాలిన జక్కవలు గావు సుమీ
కులికి నిన్నొరసేటి గుబ్బలు కాని ||
తతి నీపావురాల రొద లివి గావు సుమీ
రతినాపె మదనమంత్రములు గాని |
యితవుగా శ్రీవేంకటేశ యింతిగూడితివి
మతకారి గాదుసుమీ మంచి రాయంచగాని ||
ఇన్ని చందాలకు గురి యీ వనితయై ఉన్నది
యెన్నుకొని వేడుకతో నేలుదువుగాని ||
చేరి నీవు పెంచిన చిలుక కాదు సుమీ
పేరుకొని నీ దేవులు పిలిచీఁగానీ |
కూరిమి నీ వనములలో కోవిల కాదు సుమీ
సారెకు నాకె నిన్నుఁగొసరి పాడీనీ ||
తొలుత నీ కొలఁకుల తొమ్మిదలు గావు సుమీ
సొలసి చూచిన యాపె చూపులు గాని |
చలాన నీపై వాలిన జక్కవలు గావు సుమీ
కులికి నిన్నొరసేటి గుబ్బలు కాని ||
తతి నీపావురాల రొద లివి గావు సుమీ
రతినాపె మదనమంత్రములు గాని |
యితవుగా శ్రీవేంకటేశ యింతిగూడితివి
మతకారి గాదుసుమీ మంచి రాయంచగాని ||
raagam: hindolam
Taalam: aadi
Composer: Annamaacaarya
Language: Telugu
Pallavi
Kondalalo nelakonna koneti raayadu vaadu
kondalanta varamulu guppedu vaadu
(konda)
Caranam 1
Kummara daasudaina guruvarati nambi
immanna varamulella iccina vaadu
dommulu cesinayatti tondamaan cakkuravarti
rammanna cotiki vacci nammina vaadu
(konda)
Caranam 2
Kancilonanunda tirukacci nambi meeda
karuninci tana yedaku rappincina vaadu
yenca neppudaina venkatesudu manalaku
mancivaadai karunapaalincina vaadu
(konda)
Lyrics:
ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాతరములెంచి చూడ పిండంతేనిప్పటి అన్నట్లుకొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచుసరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధములను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిము నే అల్పబుద్ది దలచిన వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన ఘన బుద్దులకు ఘనుడవు
నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని ఉన్నా దైవము
ఈవల నే నీ శరణననెదను ఇదియే పర తత్త్వము నాకు
ఇదియే పర తత్త్వము నాకు ఇదియే పర తత్త్వము నాకు

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు
వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే||
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ||

ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
Lyrics:
మునులతపము నదె మూలభూతి యదె
వనజాక్షుడే గతి వలసినను
నరహరి నామము నాలుకనుండగ
పరమొకరి నడుగ(బని యేల
చిరపుణ్యము నదె జీవరక్ష యదె
సరుగగాచు నొకసారె నుడిగినా
మనసులోననే మాధవుడుండగ
వెనుకొని యొకచో వెదకగనేటికి
కొనకుగొన యదే కోరెడి దదియే
తను(దారక్షించు తలచినను
శ్రీవెంకటపతి చేరువ నుండగ
భావకర్మముల భ్రమయగనేటికి
దేవుడు నతడే తెరువూ నదియే
కావలెనంటే కావకపోడు
మునులతపము నదె మూలభూతి యదె
వనజాక్షుడే గతి వలసినను
నరహరి నామము నాలుకనుండగ
పరమొకరి నడుగ(బని యేల
చిరపుణ్యము నదె జీవరక్ష యదె
సరుగగాచు నొకసారె నుడిగినా
మనసులోననే మాధవుడుండగ
వెనుకొని యొకచో వెదకగనేటికి
కొనకుగొన యదే కోరెడి దదియే
తను(దారక్షించు తలచినను
శ్రీవెంకటపతి చేరువ నుండగ
భావకర్మముల భ్రమయగనేటికి
దేవుడు నతడే తెరువూ నదియే
కావలెనంటే కావకపోడు
ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె,
అదనెరిగి తెచ్చితి నవథరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను పాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేవమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
అదనెరిగి తెచ్చితి నవథరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను పాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేవమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు॥
ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥
బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చ్లగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు॥
ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥
బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చ్లగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥
విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ||
గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు ||
హరిపాదములే మాకు నన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు||
అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున గొలిచితి మానరో భవములు||
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ||
గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు ||
హరిపాదములే మాకు నన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు||
అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున గొలిచితి మానరో భవములు||
ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిలరక్షకు(డు
శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు
పురువు కుండే నెలవు భువనేశ్వరమై తోచు
పెరచోటి గుంతయైన ప్రియమై యుండు
యిరవై ఉండితే చాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు "సర్వం విష్ణు మయము"
అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికిదాసుడైతే
హెచ్చుకుందేమి లేదు యేలినవాడితడే
EdAya nEmi hari ichchina janmamE chAlu
AdinArAyaNuDI akhilarakshaku(Du
Sunakamu batukunu sukhamayyE tOchugAni
tanakadi hInamani talachukOdu
manasoDabaDitEnu maMchidEmi kAnidEmi
tanuvulO aMtarAtma daivamauTa tappadu
puruvu kuMDE nelavu bhuvanESwaramai tOchu
perachOTi guMtayaina priyamai yuMDu
yiravai uMDitE chAlu yeguvEmi diguvEmi
varusa lOkamulu "sarwaM vishNu mayamu"
achchamaina j~nAniki aMtA vaikuMThamE
chechchera tana timmaTE jIvanmukti
kachchupeTTi SrIvEMkaTapatikidAsuDaitE
hechchukuMdEmi lEdu yElinavADitaDE

నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే ఆత్మ నిధానాంజనము
నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదనా
నమో త్రివిక్రమా నమో వామనా
నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్నతే నమో అనిరుధ్ధా
నమో పురుషోత్తమా నమో అధోక్షజా
నమో నారసింహా నమోస్తు అచ్యుతా
నమో జనర్ధనా నమోస్తు ఉపేంద్ర
నమో శ్రీ వేంకటేశ నమో శ్రీ కృష్ణ
నీ నామమే ఆత్మ నిధానాంజనము
నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదనా
నమో త్రివిక్రమా నమో వామనా
నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్నతే నమో అనిరుధ్ధా
నమో పురుషోత్తమా నమో అధోక్షజా
నమో నారసింహా నమోస్తు అచ్యుతా
నమో జనర్ధనా నమోస్తు ఉపేంద్ర
నమో శ్రీ వేంకటేశ నమో శ్రీ కృష్ణ
poDa ganTi mayya mimmu purushottamA mammu neDayaka vayya kOnETi rAyaDA || kOri mammu nElinaTTi kula daivamA, chAla nErichi pedda lichchina nidhanamA gAra vinchi dappi deerchu kAla mEghamA, mAku chEruva chittamu loni SreenivAsuDA || bhAvimpa gaivasamaina pArijAtamA mammu chEva dEra gAchi naTTi chintA maNi kAminchi kOrika lichchE kAma dhEnuvA mammu tAvai rakshim chETi dharaNi dharA || cheDa neeka bratikinchE siddhamantramA, rOgA laNachi rakshimchE divyaushadhamA baDi bAyaka tirigE praNa bandhuDa mammu gaDi yinchi naTTi Sree vEnkata nAdhuDA || |
ప|| జయమంగళము నీకు సర్వేశ్వర | జయమంగళము నీకుజలజవాసినికి ||
చ|| శరణాగతపారిజాతమా | పొరి నసురలపాలిభూతమా |
అరుదయిన సృష్టికి నాదిమూలమా వో- | హరి నమో పరమపుటాలవాలమా ||
చ|| సకలదెవతాచక్రవర్తి | వెకలిపై నిండినవిశ్వమూర్తి |
అకలంకమైనదయానిధి | వికచముఖ నమో విధికివిధి ||
చ|| కొలిచినవారలకొంగుపైడి | ములిగినవారికి మొనవాడి |
కలిగినశ్రీవెంకటరాయా | మలసి దాసులమైనమాకు విధేయా ||

No comments:
Post a Comment